హెడ్జ్ ఫండ్
హెడ్జ్ ఫండ్ సమకూర్చిన పెట్టుబడి మూలధనం. ఈ మూలధనాన్ని సంక్లిష్టమైన ట్రేడింగ్, రిస్క్ నిర్వహణ పద్ధతుల ద్వారా మదుపు చేసి, మార్కెట్ రిస్కులకు తట్టుకునేలాగా పెట్టుబడిని వృద్ధి చేస్తారు.
హెడ్జ్ ఫండ్ లను ప్రత్యామ్నాయ పెట్టుబడులుగా భావిస్తారు. వీళ్ళకున్న పరపతి, క్లిష్టమైన పెట్టుబడి విధానాలు వీటిన మామూలు మదుపరికి అందుబాటులో నియంత్రణకు లోబడి ఉన్న మ్యూచువల్ ఫండ్స్, ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) లాంటి వాటినుంచి వేరు చేస్తాయి.
హెడ్జ్ అనే పదానికి ఒక స్థలం చుట్టూ ఆవరించిఉన్న పొదలు అని అర్థం. ఈ పదాన్ని చాలా కాలంగా రిస్క్ కు పరిమితి విధించడం అనే అర్థంలో వాడుతున్నారు.[1]
ఒక హెడ్జ్ ఫండ్ సాధారణంగా దాని పెట్టుబడి నిర్వాహకుడికి (ఫండ్ మేనేజరు) నిర్వహణ రుసుమును (ఫండ్ నికర ఆస్తి విలువలో సంవత్సరానికి సుమారు 2%). ఇంకా పనితీరు రుసుమును (సాధారణంగా, ఒక సంవత్సరంలో ఫండ్ యొక్క నికర ఆస్తి విలువ పెరుగుదలలో 20%) చెల్లిస్తుంది. హెడ్జ్ ఫండ్స్ అనేక దశాబ్దాలుగా ఉనికిలో ఉన్నాయి. కాలక్రమేణా మరింత ప్రజాదరణ పొందాయి. 2021 నాటికి దాదాపు $3.8 ట్రిలియన్ల ఆస్తులతో వారు ఇప్పుడు అసెట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో గణనీయమైన భాగంగా ఎదిగారు.[2][3] హెడ్జ్ ఫండ్ మేనేజర్లు నిర్వహణలో (AUM) అనేక బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంటారు.
మూలాలు
[మార్చు]- ↑ "Hedge your bets". The Phrase Finder. Archived from the original on 29 జూలై 2014. Retrieved 25 జూలై 2014.
- ↑ "Hedge fund assets hit record $3.8 trillion in first quarter". Reuters. 2021-04-21. Retrieved 2021-08-05.
- ↑ Lemke, Lins, Hoenig & Rube, Hedge Funds and Other Private Funds: Regulation and Compliance (Thomson West, 2014 ed.)